కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
6 గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారంటూ కేటీఆర్ ఆరోపణ

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ పాలన, హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ‘బాకీ కార్డులు’ ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజల ముందు ఉంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ హామీల అమలుపై ప్రచారం నిర్వహించనున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
