ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన NRI విద్యార్థి సిద్ధార్థ్ వినూత్న యాప్ను ఆవిష్కరించాడు. కృత్రిమ మేధ (AI) సహాయంతో కేవలం ఏడు సెకన్లలో గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే ‘సిర్కాడియావీ’ అనే యాప్ను అభివృద్ధి చేశాడు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తన ఆవిష్కరణను వివరించాడు. ఆ యాప్ సాంకేతికత, ఉపయోగాలను తెలుసుకున్న చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
ఆరోగ్యరంగంలో AI వినియోగానికి ఇది గొప్ప ముందడుగు కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
