రూ.1 లక్ష లంచం.. ఇద్దరు అధికారులను పట్టుకున్న ఏసీబీ

హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్‌లో రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. తెలంగాణ సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ (AO-1), TSIDCలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2)ను సిటీ రేంజ్-II ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…ఫిర్యాదుదారుడి మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.2 లక్షల మొత్తానికి చెక్కు ఇప్పించడం, మిగిలిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇద్దరు అధికారులు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఇంతకుముందు కూడా AO-1, AO-2లు ఫిర్యాదుదారుడి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.5,000 లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.తాజాగా AO-2 రూ.1 లక్ష లంచాన్ని స్వీకరించి AO-1కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం డిమాండ్ చేసినా లేదా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
