టేకుమట్లలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు

టేకుమట్ల, సెప్టెంబర్ 10(Zindagi9news): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేకుమట్ల రజక సంఘం మండల అధ్యక్షుడు చెలికాని శంకర్, నిమ్మల స్వామి, జంగా పెళ్లి సారయ్య, సమ్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా టేకుమట్ల మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా రజక సంఘాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టేకుమట్ల సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, బూర్నాపల్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్, వెలిశాల సర్పంచ్ బొడ్డు తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఆది సునీత రఘు, టేకుమట్ల ఉపసర్పంచ్ ఎలబోయిన రజిత నర్సయ్య, సోమనపల్లి ఉపసర్పంచ్ అబ్బెంగుల రాజయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మచ్చ శ్రీకాంత్ మాదిగ, జిల్లా నాయకుడు రామ్ రామచందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
నాలుగో వార్డు సభ్యుడు మచ్చ భాగ్య సరోతం, నిమ్మల స్వామి, కంచెర్ల మహేష్, మాదారపు కుమారస్వామి, మారం శ్రీను తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
