
జమ్మికుంట, అక్టోబర్ 18 (జిందగీ 9 న్యూస్): జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధిలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు ప్రతిరోజూ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు. ఈ సత్కార్యానికి యప్‌టీవీ (YuppTV), టురిటో (Turito) వ్యవస్థాపకుడు, సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ.51,116 విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరగానే ఆయన స్పందించి, తన బృందం ద్వారా విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, సుభాష్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని, ఈ ఏడాది ఉత్సవాలు గతంలో కంటే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమానికి విరాళం అందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, దుర్గామాత కరుణాకటాక్షాలు ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ అధ్యక్షుడు ముత్యాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి చుక్కారపు అఖిలేష్, ఉపాధ్యక్షులు చుంచు శివ, చుంచు వీరేశం, ఎల్ల గణేష్, సీహెచ్ మనోజ్ కుమార్, కమిటీ సభ్యులు, జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్‌తో పాటు పాడి ఉదయ్ నందన్ రెడ్డి బృందం సభ్యులు రాయిశెట్టి కుమారస్వామి, మంతెన శ్రీధర్, తాళ్లపెల్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, తొట్ల రాకేష్, దాసారపు చందు, లోకేష్, అశోక్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
