
- జమ్మికుంట గాంధీ చౌరస్తాలో విగ్రహం కనిపించకుండా చుట్టుముట్టిన భారీ కటౌట్లు
- పట్టణ ఫ్లైఓవర్‌పైనా ఇష్టారాజ్యంగా వెలిసిన వ్యాపార ఫ్లెక్సీలు
- వాహనదారుల దృష్టికి అంతరాయం.. ట్రాఫిక్ భద్రతపై ఆందోళన
- మున్సిపల్, ట్రాఫిక్ పోలీసు అధికారులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి
జమ్మికుంట (జిందగీ9న్యూస్):
పండుగ వేళ పట్టణాన్ని అందంగా అలంకరించాల్సింది పోయి, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. జాతిపిత విగ్రహం కనిపించకుండా ప్రకటనల కటౌట్లు చుట్టుముట్టడంతో అసలు గాంధీ విగ్రహం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పట్టణంలోని ఫ్లైఓవర్‌పైనా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పండుగల సమయంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన చోట వ్యాపార ప్రకటనలతో కూడళ్లను కమ్మేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపార ప్రచారానికి అభ్యంతరం లేకపోయినా, మహనీయుల విగ్రహాల గౌరవానికి భంగం కలగకుండా, ప్రజా ప్రదేశాల్లో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలపై ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఫ్లెక్సీల వల్ల వాహనదారుల దృష్టికి అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ భద్రతను కూడా అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మున్సిపల్, ట్రాఫిక్ పోలీసు అధికారులు స్పందించి గాంధీ విగ్రహం చుట్టూ, ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
