
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (Zindagi9news): బీబినగర్ సమీపంలో బుధవారం సిర్పూర్-కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు, దట్టమైన పొగలు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో బ్రేక్ లైనర్ చక్రానికి బలంగా రాపిడి కావడంతో మంటలు, పొగలు వచ్చినట్లు ప్రాథమికంగా సమాచారం. దీనిని గమనించిన కో-పైలట్ వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
