కొరుట్ల RTA కార్యాలయంలో ACB ఆకస్మిక తనిఖీలు.. పలు అవకతవకలు గుర్తింపు
జగిత్యాల జిల్లా: కొరుట్లలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) కరీంనగర్ రేంజ్ అధికారులు అక్టోబర్ 6న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలాన్లు, పెండింగ్ దరఖాస్తులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం..తనిఖీల్లో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎన్. గిరీష్ కుమార్, MVI లేకుండానే వాహనాల డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహించడం, వాహనాల రిజిస్ట్రేషన్ తనిఖీలు చేస్తున్నట్లు గుర్తించినట్లు ACB తెలిపింది. అలాగే అధికారిక పనులు చేయించేందుకు ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
ప్రజలు సమర్పించిన దరఖాస్తుల విషయంలో ఏజెంట్లకు RTA కార్యాలయంలో స్వేచ్ఛగా ప్రవేశం ఉండటం, సంబంధిత సిబ్బందితో నేరుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, సిబ్బంది విధులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా తనిఖీల్లో బయటపడింది.
డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహించే ప్రదేశం రవాణా శాఖ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, డ్రైవింగ్ ట్రాక్ వద్ద అవసరమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయలేదని ACB అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో గుర్తించిన అవకతవకలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ACB అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip
ZINDAGI9NEWS
డ్రైవింగ్ టెస్ట్‌ల నుంచి ఏజెంట్ల దందా వరకు.. కొరుట్ల RTAలో ACB తనిఖీలు