హుజూరాబాద్ రత్నం.. అంతర్జాతీయ వేదికపై సత్యం గౌడ్ ప్రభంజనం
‘వండర్ ఇండియా రికార్డ్స్’లో సువర్ణాక్షరాలతో లిఖితం.. ‘భారత్ గౌరవ్’ పురస్కారంతో ఘన సత్కారం
హుజూరాబాద్, అక్టోబర్ 6: హుజూరాబాద్ గడ్డ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రజాకవి, మానవ విలువల పరిరక్షణ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు డా. నాగుల సత్యం గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సామాజిక, ఆధ్యాత్మిక సేవలను గుర్తించిన ‘వండర్ ఇండియా రికార్డ్స్’ సంస్థ తమ అధికారిక రికార్డుల పుస్తకంలో ఆయనకు స్థానం కల్పించడంతో పాటు ప్రతిష్టాత్మక ‘భారత్ గౌరవ్’ పురస్కారంతో సత్కరించింది.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని రవీంద్రభారతి మెయిన్ హాల్లో గాంధీ జయంతి, దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత్ వరల్డ్ రికార్డ్, ఏబీసీడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కదరి వెంకటరమణ రావు సమక్షంలో ప్రముఖుల చేతుల మీదుగా సత్యం గౌడ్‌ను పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు. ఐడెంటిటీ కార్డు, అంతర్జాతీయ రికార్డు పతకం, ప్రశంసాపత్రంతో పాటు ‘భారత్ గౌరవ్’ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. రచనలు, ఉపన్యాసాల ద్వారా మానవీయ విలువలను పెంపొందిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజానికి పంచుతున్న సత్యం గౌడ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
డా. నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ.. సమాజ వికాసానికి అహింసా మార్గమే ప్రధానమని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి లోకకళ్యాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశ పురోగతికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ మందడి కృష్ణారెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, సీఏ ప్రతినిధి బొగ్గారపు భాగ్యలక్ష్మి, నృత్య గురువులు పి.రంగనాయకి, వినయ్ రాథోడ్, అసలం, ఆదర్శ ఫౌండేషన్ నిర్వాహకులు కుసుమ భోగరాజు, తోట వందన, పల్లి శిరీష, కీర్తనలతో పాటు పలువురు రచయితలు, కళాకారులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ ముద్దుబిడ్డకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, సాహితీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip