సింగరేణి, కోల్ ఇండియా కార్మికులకు దీపావళి ధమాకా.. రూ.1,10,250 బోనస్ ఖరారు!
కోల్‌కతా/హైదరాబాద్: బొగ్గు గని కార్మికులకు దీపావళి పండుగకు ముందే భారీ కానుక లభించింది. సింగరేణి, కోల్ ఇండియా సంస్థల్లో పనిచేస్తున్న నాన్-ఎగ్జిక్యూటివ్ కార్మికులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,10,250 పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (PLR) బోనస్‌గా చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కోల్‌కతాలోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన JBCCI అపెక్స్ జేసీసీ సమావేశంలో యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోల్ ఇండియా చైర్మన్ బి. సాయిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో AITUC, BMS, CITU, HMS తదితర జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తొలుత రూ.1.20 లక్షల బోనస్‌ను డిమాండ్ చేయగా, చర్చల అనంతరం రూ.1,10,250 వద్ద తుది ఒప్పందం కుదిరినట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
గత ఏడాది కార్మికులకు రూ.1,03,000 PLR బోనస్ చెల్లించగా, ఈసారి రూ.7,250 పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోల్ ఇండియా అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 2 లక్షలకు పైగా కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. తెలంగాణలోని సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 32 వేల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది.
దీపావళి పండుగకు ముందుగానే బోనస్ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. బోనస్ ఖరారుతో సింగరేణి, కోల్ ఇండియా బొగ్గు గని ప్రాంతాల్లో కార్మికులు, వారి కుటుంబాల్లో పండుగ ఆనందం నెలకొంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip