జమ్మికుంట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్, మడిపల్లి, నాగంపేట గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. జమ్మికుంట మండల బీజేపీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, గర్భిణులకు మంచి ఆహార పదార్థాలు అందించేలా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని సన్మానించారు. గర్భిణులను తమ ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కవిడి కుమారస్వామి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, వేగ్గల సుమలత, మేకమల్ల తిరుమల, సంపెల్లి సంపత్రావు, కప్పల నరసయ్య, నాగపురి విక్రమ్, యు. లింగమూర్తి, మిల్కూరి రాఘవరెడ్డి, ఏక్కడి శ్రీధర్, ఆవుల లక్ష్మణ్, మేకమల్ల సురేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.