హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో 310 ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిధిలోని మినిరత్న (కేటగిరీ-I) సంస్థ అయిన ECIL.. Apprenticeship Act, 1961 కింద హైదరాబాద్‌లోని సంస్థలో అప్రెంటిస్‌లను తీసుకోనుంది. Advertisement No.11/2026ను సెప్టెంబర్ 30న విడుదల చేసింది.
మొత్తం 13 ట్రేడ్లలో 310 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 86, ఫిట్టర్ 87, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) 41, ఎలక్ట్రీషియన్ 50, వెల్డర్ 16, టర్నర్ 8, మెషినిస్ట్ 7, మెకానిక్ (రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్) 5, మెషినిస్ట్ (G) 2, పెయింటర్ 2, కార్పెంటర్ 2, ప్లంబర్ 2, డీజిల్ మెకానిక్ 2 సీట్లు ఉన్నాయి. ఇందులో 16 సీట్లు PWD అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్ కింద కేటాయించారు.
అర్హత, వయోపరిమితి
సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ సర్టిఫికెట్ (NCVT) కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నివసించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2026 అక్టోబర్ 31 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు, OBCలకు 28, SC/STలకు 30 సంవత్సరాలు. PWD అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ITI మార్కుల ఆధారంగా ఎంపిక
అభ్యర్థులను ITIలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 70 శాతం సీట్లను ప్రభుత్వ ITI విద్యార్థులతో, 30 శాతం సీట్లను ప్రైవేట్ ITI విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు ECIL తెలిపింది.
రెండు దశల్లో దరఖాస్తు
అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in లో MSDE అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ECIL వెబ్సైట్ (https://www.ecil.co.in/home)లో Human Resources → Current Job Openings ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలి. MSDE పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తే సరిపోదని, ECIL వెబ్సైట్లో దరఖాస్తు తప్పనిసరిగా సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఆన్లైన్ దరఖాస్తులు 2026 సెప్టెంబర్ 30 సాయంత్రం 6 గంటల నుంచి అక్టోబర్ 11 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు అనంతరం సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్‌తో ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
పత్రాల పరిశీలన అక్టోబర్ 22 నుంచి 24 వరకు, ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అక్టోబర్ 28 నుంచి 29 వరకు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. అప్రెంటిస్‌షిప్ శిక్షణ నవంబర్ 2, 2026 నుంచి ప్రారంభమవుతుంది. శిక్షణ కాలం ఒక సంవత్సరం.
అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తర్వాత ట్రేడ్‌లో నైపుణ్యాన్ని నిర్ధారించేందుకు ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత MSDE ద్వారా National Apprenticeship Certificate (NAC) జారీ అవుతుంది. అయితే శిక్షణ పూర్తయిన తర్వాత ECILలో ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత సంస్థకు లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.