అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు
కరీంనగర్ , సెప్టెంబర్ 29(Zindagi9news): ఆరోగ్యకరమైన జీవనశైలితోనే రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలమని, పటిష్టమైన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆహారపు అలవాట్లలోనూ అవసరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు.
స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), రెనీ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని CPR ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని వాటిని అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గుండె జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించడం ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నడక సాగించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు.
రెనీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి మాట్లాడుతూ ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. దీక్షిత్ CPR విధానాన్ని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రదర్శన ద్వారా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో CPRపై అవగాహన, ప్రాథమిక శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అంశాన్ని వార్షిక ప్రణాళికలో భాగంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. CPRపై అవగాహన పెంపొందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో IMA కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ, కార్యదర్శి డాక్టర్ ఎన్. మహేష్ బాబు, కోశాధికారి డాక్టర్ వి. నీలిమ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బి. దీక్షిత్, డాక్టర్ సారంగ్, SRR డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కరీంనగర్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆచార్య వడ్లూరి శ్రీనివాస్, రెనీ హాస్పిటల్స్ ప్రతినిధి ఎం. అరవింద్ బాబు, జనరల్ డైరెక్టర్ పవన్ ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip
ZINDAGI9NEWS
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ప్రపంచ గుండె దినోత్సవం.. విద్యార్థులకు CPRపై శిక్షణ