రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు.. రూ.450 కోట్లతో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు.. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం
హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 1.30 లక్షల మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులు జమ చేసినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా ప్రతి నెలా వారి ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద 50 వేల మందికి కిట్లు మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను పంపిణీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి శిక్షణ పూర్తయిన అనంతరం కిట్లు అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’
బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఆర్థిక ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా ఫూలే) గురుకులాల్లో పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని తెలిపారు. గురుకులాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ గడువు పొడిగింపు
ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మొదటి, రెండో విడతలుగా 180 మంది విద్యార్థులకు రూ.18.40 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి త్వరలో నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు.. రూ.450 కోట్లతో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు.. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం
హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 1.30 లక్షల మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులు జమ చేసినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా ప్రతి నెలా వారి ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.60 కోట్లతో ‘కాటమయ్య రక్షణ కవచాలు’