కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు

జగిత్యాల, ఆగస్టు 17 (Zindagi9news): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయారు. స్థానికులు తీవ్రంగా శ్రమించి డ్రైవర్ను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
