హైదరాబాద్లో 73 వైద్య ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్, ఆగస్టు 17 (జిందగీ9న్యూస్): హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో NHM/NUHM కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. ఇందులో మెడికల్ ఆఫీసర్లు 24 పోస్టులు, స్టాఫ్ నర్సులు 49 పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు MBBS, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నెలకు రూ.52,000 వేతనం చెల్లిస్తారు.
స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM/B.Sc Nursing/M.Sc Nursing లేదా Post Basic B.Sc Nursing అర్హత కలిగి, సంబంధిత నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి. నెలకు రూ.29,900 వేతనం అందజేస్తారు.
దరఖాస్తుల తేదీలు: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఆగస్టు 20 నుంచి 22 వరకు, స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 24, 25 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులను హైదరాబాద్ జిల్లా DM&HO కార్యాలయం, 4వ అంతస్తు, GHMC బిల్డింగ్, బర్కత్పురా, సికింద్రాబాద్లో సమర్పించాలి.
దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను జత చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500గా నిర్ణయించారు. దరఖాస్తు ఫారం, మార్గదర్శకాలను హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్ https://hyderabad.telangana.gov.in/notice_category/recruitment/ లో పొందవచ్చు.
