NALSAR విద్యార్థులకు భారీ ఊరట.. బార్ కౌన్సిళ్లలో ఎన్రోల్మెంట్కు గ్రీన్ సిగ్నల్
2026లో పాసైన విద్యార్థులపై ఎన్రోల్మెంట్ నిషేధాన్ని సవరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకునే అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 13 (జిందగి9న్యూస్): నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) యూనివర్సిటీకి చెందిన 2026లో పట్టభద్రులైన విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) కీలక ఊరటనిచ్చింది. NALSAR విద్యార్థుల స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్పై గతంలో విధించిన నిషేధాన్ని సవరించింది.
ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా పేరుతో ఆగస్టు 13, 2026న ఉత్తర్వులు జారీ అయ్యాయి. NALSAR 2026 పాస్అవుట్ విద్యార్థుల్లో అత్యధికులు నిర్దోషులని, అవమానకర చర్యలో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో NALSAR విద్యార్థులను స్టేట్ బార్ కౌన్సిళ్లలో నమోదు చేయకుండా విధించిన నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సవరించింది. ఇకపై NALSAR 2026లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకునేందుకు అర్హులు అని స్పష్టం చేసింది.
ఇంతకుముందు జారీ చేసిన లేఖలో NALSAR విద్యార్థుల ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఆంక్షలు విధించగా, తాజా నిర్ణయంతో ఆ ఆంక్షలను సవరించినట్లు BCI తెలిపింది.
దీంతో NALSARలో 2026లో న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే అవకాశం లభించింది.
