అంతరిక్షంలోనూ రెపరెపలాడిన ‘త్రివర్ణ పతాకం’!

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రష్యన్ వ్యోమగాములు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ ప్రత్యేక సందేశాన్ని అందించారు. సరిహద్దులు దాటి అంతరిక్షంలోనూ భారతదేశ కీర్తి, త్రివర్ణ పతాక శోభ ప్రతిధ్వనించింది.
