కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట
ఎంపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల యత్నం
అప్రమత్తమైన పోలీసులు.. కాంగ్రెస్ నేతల అదుపులోకి తీసివేత
డీసీసీ కార్యాలయానికి ర్యాలీకి సిద్ధమైన బీజేపీ శ్రేణులు

కరీంనగర్, జూలై 22 (Zindagi9News): కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు రాజేందర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలను వెంబడించగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ తీరును నిరసిస్తూ డీసీసీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
