భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
ప్రేమ వివాహం రెండేళ్లకే విషాదాంతం.. కేసు నమోదు చేసిన పోలీసులు

కరీంనగర్, జూలై 6 (Zindagi9news): కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, తీగలగట్టపల్లిలో అద్దెకు ఉంటున్న కల్యాణం రాకేశ్ (27) రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సంజనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్య సంజన భర్తను మానసికంగా వేధిస్తోందని, తల్లిదండ్రులను కలవొద్దని, ఫోన్లో కూడా మాట్లాడొద్దని ఆంక్షలు విధించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలనున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
