గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: తహసీల్దార్‌కు కౌన్సిలర్ వినతి

జమ్మికుంట, జూలై 3(Zindagi9news): జమ్మికుంట మున్సిపాలిటీ 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి బౌండరీ ఏర్పాటు చేసి కుంటను పరిరక్షించాలని 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ నూతన తహసీల్దార్ గడ్డం సుధాకర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల జమ్మికుంట తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం గౌన్లవానీకుంటను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ త్వరలోనే సంబంధిత సిబ్బందితో సర్వే నిర్వహించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తహసీల్దార్‌కు కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అసెంబ్లీ కార్యదర్శి రోమాల రాజ్‌కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దాసరి రామ్మూర్తి, శివమణి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
