జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ
ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా మిడ్జిల్లో నిర్వహణ

హైదరాబాద్, జూలై 1(Zindagi9news): ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూలై 4న కొడంగల్ నియోజకవర్గంలోని మిడ్జిల్లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తొలి అడుగుకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ సభలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
