
చిట్‌ఫండ్ మోసం, అప్పుల ఒత్తిడితో యువకుడు పురుగుల మందు సేవనం.. జమ్మికుంటలో ఘటన
జమ్మికుంట మండల పరిధిలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఆరుకాల సాయికుమార్ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు సేవించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు వివరాల ప్రకారం, జమ్మికుంటకు చెందిన నరహరిశెట్టి రాకేష్ ప్రైవేటు చిట్ ఫండ్స్ నిర్వహిస్తూ సాయికుమార్‌కు పరిచయం అయ్యాడని పేర్కొన్నారు. సుమారు రూ.2.50 లక్షల చిట్ మొత్తం గడువు పూర్తయినప్పటికీ తిరిగి చెల్లించకుండా, నమ్మించి క్రెడిట్ కార్డుల ద్వారా రూ.3.20 లక్షల రుణం తీసుకున్నట్లు ఆరోపించారు.అదే విధంగా సుమారు 16 గ్రాముల బంగారు గొలుసును బ్యాంకులో తాకట్టు పెట్టించి గోల్డ్ లోన్ కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బుల గురించి అడిగితే ప్రతిసారి తప్పించుకుంటూ, సాయికుమార్‌ను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.ఈ క్రమంలో మే 29 ఉదయం సుమారు 10 గంటల సమయంలో, బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక సాయికుమార్ మనోవేదనకు గురై పురుగుల మందు సేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
