సీయూఈటీ (UG) 2026 పరీక్షలు వాయిదా.. ఎన్టీఏ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఈ నెల 28న నిర్వహించాల్సిన సీయూఈటీ (UG) 2026 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రెండు షిఫ్టుల్లో జరగాల్సిన పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈద్-ఉల్-జుహా (బక్రీద్) పండుగ సెలవు తేదీ మారడంతో పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడిందని ఎన్టీఏ తెలిపింది. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది.
వాయిదా పడిన అభ్యర్థులకు సంబంధించిన సవరించిన పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లలో ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
