ముద్ర యోజన పేరిట నకిలీ లోన్ లెటర్.. ప్రజలను అప్రమత్తం చేసిన పీఐబీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) కింద రూ.5 లక్షల రుణం మంజూరైనట్లు సోషల్ మీడియాలో, మెసేజ్ల రూపంలో వస్తున్న లెటర్లు పూర్తిగా నకిలీవి అని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం పీఐబీ (PIB Fact Check) స్పష్టం చేసింది.
కొంతమంది మోసగాళ్లు ‘లోన్ ప్రాసెసింగ్ ఫీజు’ పేరిట రూ.2,550 చెల్లించాలని కోరుతూ ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి నకిలీ లెటర్లు, మెసేజ్లు నమ్మి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని కేంద్రం సూచించింది.
ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణాల మంజూరు ప్రక్రియ అధికారిక బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా మాత్రమే జరుగుతుందని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు లేదా లెటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఏదైనా సందేహాస్పద సమాచారం ఎదురైతే సంబంధిత అధికారిక వెబ్సైట్ లేదా బ్యాంకును సంప్రదించాలని పీఐబీ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
