
వీణవంక జడ్పీహెచ్ఎస్కు పూర్వ విద్యార్థుల చేయూత
స్టేజి షెడ్డు నిర్మాణానికి రూ. లక్ష విరాళం
వీణవంక, మే 13 (Zindagi9News): వీణవంక మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ (ZPHS) హైస్కూల్లో స్టేజి షెడ్డు నిర్మాణం కోసం పూర్వ విద్యార్థులు రూ.1 లక్ష విరాళం అందజేశారు. పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసి, పదవీ విరమణ పొందిన అనంతరం తమ చదివిన పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందించడం విశేషంగా నిలిచింది.
పాఠశాల అభివృద్ధిలో భాగంగా స్టేజి నిర్మాణం చేపట్టేందుకు వివిధ సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి ఈ విరాళాన్ని అందించారు. ఇందులో రాయిశెట్టి రాజమల్లయ్య, మహకళ సాంబశివరెడ్డి, గుగ్గిల కిషన్‌రావు, గుగ్గిళ్ల భవాని ప్రసాద్, కంభంపాటి విద్యాసాగర్, సురోజు శ్రీనివాస్ తదితరులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం Puli Ashok Reddy మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందనీయమని అన్నారు. స్టేజి నిర్మాణానికి విరాళం అందించిన పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
