
నారాయణపేటలో ఏసీబీ వల: రూ. 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీవో
నారాయణపేట:
అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. నారాయణపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) పాత్లావత్ రామచందర్ రూ. 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఘటన వివరాలు:
ఫిర్యాదుదారుడు మరియు అతని నలుగురు స్నేహితుల జనన ధృవీకరణ పత్రాల (Birth Certificates) ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైళ్లను ఆమోదించడానికి ఆర్డీవో రామచందర్ రూ. 25,000 డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పథకం ప్రకారం మంగళవారం రోజున లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి ఆర్డీవోను అదుపులోకి తీసుకున్నారు. లంచం మొత్తాన్ని ఆయన వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.
అవినీతిపై పోరాడండి – ఏసీబీ కీలక సూచన
ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.
టోల్ ఫ్రీ నంబర్: 1064
వాట్సాప్ నంబర్: 9440446106
వెబ్సైట్: acb.telangana.gov.in
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
