
గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. విద్యా రంగంపై కీలక చర్చలు
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జూన్ 12న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వివరించారు.
విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. విద్యార్థుల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు ప్రమాణ కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాలలు మరియు కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని సూచించారు.
గవర్నర్ సూచనలను సానుకూలంగా స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
