
జమ్మికుంట మున్సిపాలిటీలో రికార్డు స్థాయికి ‘అంగడి’ వేలం: రూ. 55.35 లక్షలు పలికిన పాట
జమ్మికుంట, మార్చి 17(Zindagi9news):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే వారం వారం అంగడి (సంత) వేలం పాట ఈ ఏడాది రికార్డు స్థాయి ధర పలికింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మహమ్మద్ అయాజ్ ల పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలంలో పరకాల గ్రామానికి చెందిన పోరండ్ల రమేష్ అత్యధికంగా రూ. 55,35,000 (55.35 లక్షలు) పాడి వేలాన్ని దక్కించుకున్నారు.
గతంతో పోలిస్తే భారీ పెరుగుదల
గత ఏడాది (2025-26) కూడా ఇదే అంగడి వేలాన్ని పోరండ్ల రమేష్ రూ. 40,61,000కు దక్కించుకోగా, ఈసారి పోటీదారులు పోటాపోటీగా వేలం పాడటంతో ప్రభుత్వం ఆశించిన దానికంటే అధిక ఆదాయం చేకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 14.74 లక్షల రూపాయల అధిక ఆదాయం మున్సిపాలిటీకి లభించినట్లయింది.
అధికారుల సమక్షంలో పారదర్శకంగా..
మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అంగడి వేలాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, వచ్చిన ఆదాయాన్ని పట్టణ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
