పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సంచలన నిర్ణయం: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేత

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసిన గడ్డం ప్రసాద్, సంబంధిత ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
