
స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి వివరణ
స్పీకర్ ముందు దాఖలైన అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ అఫిడవిట్ సమర్పించారు. తనపై దాఖలైన పిటిషన్లో చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. తాను స్వచ్ఛందంగా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని ఎప్పుడూ రద్దు చేసుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశాన్ని కూడా ఎక్కడా వ్యక్తం చేయలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్ తప్పుడు సమాచారంతో, ఆధారరహితంగా దాఖలైందని కడియం శ్రీహరి తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
