ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చలించిన హృదయ విదారక ఘటన బయటపడింది. అప్పుల భారంతో ఉన్న మామిడి నరేష్ (30), ఇంట్లో తనతో కలిసి ఉండే మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్(37) పేరుపై గత రెండు నెలల్లో రూ.4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో అన్నను హత్య చేసేందుకు నరేష్ రహస్యంగా పన్నాగం పన్నాడు.
ఈ కుట్రలో నరేష్‌కు రూ.13 లక్షలు ఇస్తానని చెప్పి రాకేష్(28), రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌లను ఒప్పించాడు. తన పథకం ప్రకారం గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని ఫోన్ చేసి వెంకటేష్‌ను ఘటనాస్థలానికి పిలిపించారు. అక్కడ టిప్పర్ కింద జాకీ పెట్టాలని చెప్పి, వెంకటేష్‌ను కింద పడుకోబెట్టి, టిప్పర్‌ను ముందుకు నడిపిన నరేష్… చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రమాదవశాత్తు మరణించాడని పేర్కొంటూ నరేష్ ఇచ్చిన వివరాలపై ప్రమాద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం నరేష్ ఇచ్చిన అనుమానాస్పద సమాధానాలపై ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో మళ్లీ దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇది పన్నాగపూర్వక హత్య అని తేలడంతో నరేష్, రాకేష్, ప్రదీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
