
రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టిజిఎస్పిడిసిఎల్ ఏఈ
వనపర్తి సర్కిల్ & డివిజన్ పరిధిలోని గోపాల్పేట సెక్షన్లో పనిచేస్తున్న టిజిఎస్పిడిసిఎల్ సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి లంచం కేసులో ఏసీబీ వలకు చిక్కారు.ఫిర్యాదుదారుని బంధువుకి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డిటిఆర్) మంజూరు చేసే ప్రక్రియలో మొత్తం రూ.40,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ డిమాండ్లో భాగంగా రూ.20,000/- తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రంగేహస్తాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ పేర్కొంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
