
బీసీ బంద్ ప్రభావం: నిలిచిన బస్సులు.. ప్రయాణికులకు ఇబ్బందులు
బీసీ రిజర్వేషన్లలో న్యాయం చేయాలంటూ బీసీ ఐకాస పిలుపునిచ్చిన బంద్ ప్రభావంతో జమ్మికుంట బస్టాండు లో రద్దీ లేకుండా కనిపించింది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కొందరు వ్యక్తులు అత్యవసరంగా ఆటోల్లో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం సాగించారు. బంద్ కారణంగా బస్టాండు చుట్టుపక్కల వ్యాపారాలు, హోటళ్లు కూడా మూతపడ్డాయి.
