
అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్: పర్యావరణ పరిరక్షణ వ్యాసరచన పోటీల విజేతలకు సైకిళ్ల పంపిణీ
వావిలాలపల్లి: అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్లో పర్యావరణ పరిరక్షణ వ్యాసరచన పోటీల విజేతలకు సైకిళ్లను బహుమతిగా అందజేసే కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, పాఠ్యాంశ ప్రణాళికలో దీనిని స్పష్టంగా చేర్చడం ద్వారా పర్యావరణం సంరక్షణలో లభించే లాభాలను తెలియజేయగలమని అన్నారు. నరేంద్ర రెడ్డి, సమాజంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారినది, తద్వారా భావితరాలకు ఉపయోగపడే వనరులు దొరకకపోవడం భయంకరమైన అంశమని, అందుకే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని సంరక్షించే చర్యలను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వివిధ ప్రతిభా పోటీల ద్వారా విద్యార్థుల లోతైన ప్రతిభను వెలికి తీయడం అల్ఫోర్స్ స్కూల్ యొక్క సాంప్రదాయం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. ఋషిగ్న (8వ తరగతి, బాలికల విభాగం) మరియు జి. రుషికేష్ (8వ తరగతి, బాలుర విభాగం) అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు సైకిళ్లను బహుమతిగా అందుకున్నారు. వీరికి జిల్లాస్థాయి ఉత్తమ ర్యాంకులు కూడా లభించాయి.
కార్యక్రమంలో బీఎస్ఎ-హర్కులస్ కంపెనీ ప్రతినిధులు శంకర్ గారు, జాన్ గారు, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
