
బిల్డింగ్ అనుమతుల జాప్యంపై సీఎం ఆగ్రహం
హెచ్ఎండీఏ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణ అనుమతుల జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖపై వచ్చిన ఆరోపణలను తక్షణమే విచారిస్తామని హెచ్చరించారు. చెరువులు, నాలాలపై లైడార్ సర్వే చేపట్టి వివాదాలు నివారించాలని సూచించారు. అనుమతుల మంజూరును వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
