
చెక్కులను పంపిణీ చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెబ్బేరు, ఆగస్టు 29: పెబ్బేరు మరియు శ్రీరంగాపూర్ మండలాల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులను నేడు పంపిణీ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పెబ్బేరు ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారుల చేతుల్లోకి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయ్ వర్ధన్ రెడ్డి, చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి, పెబ్బేరు ఎంఆర్ఓ మురళి గౌడు, శ్రీరంగాపూర్ ఎంఆర్ఓ రాజు, ఎంపీడీవో రోజా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

