చల్లూరులో శాంతి భద్రతల కోసం పోలీసుల కవాతు

వీణవంక, ఆగస్టు 23 (జిందగీ 9 న్యూస్): వీణవంక మండలం చల్లూరు గ్రామంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసులు కవాతు నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు, స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కవాతు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్.ఏ.ఎఫ్‌కు చెందిన 30 మంది సిబ్బంది, కరీంనగర్ కమిషనరేట్ ఎస్.ఏ.టి. విభాగానికి చెందిన 15 మంది సిబ్బంది, 20 మంది లోకల్ పోలీసులు పాల్గొన్నారు. ప్రధాన అతిథిగా జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ కవాతును ప్రారంభించారు. ఆర్.ఏ.ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టీపీ భగీల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, జమ్మికుంట ఎస్సై నాగరాజు, ఇల్లందుకుంట ఎస్సై క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మండల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు, విద్యార్థులు ఈ కవాతును వీక్షించారు. రానున్న ఉత్సవాలు, ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు అన్ని విధాలా సిద్ధమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
