అల్సర్ బాధతో యువకుడు మృతి

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానీపల్లి గ్రామానికి చెందిన పెండ్లి నవీన్ (24) అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నవీన్ పదో తరగతి వరకు చదివి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేసేవాడు. ఆగస్టు 19న సాయంత్రం పొలం నుండి ఇంటికి వచ్చిన అనంతరం గడ్డి మందు తాగినట్టు చెప్పడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చినా ఆరోగ్యం విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 21వ తేదీ అర్థరాత్రి మరణించాడు.నవీన్ అల్సర్ సమస్యతో కొంతకాలంగా బాధపడుతూ మందులు వాడుతున్నట్టు తండ్రి సమ్మయ్య తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట ఎస్ఐ ఎం. క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
