జమ్మికుంట నాయిని చెరువులో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువులో మతిస్థిమితం లేని మహమ్మద్ జబ్బర్ (64) మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు మేరకు, జబ్బర్‌కు త్రాడు నడుముకి కట్టుకునే అలవాటు ఉండేదని, ఆగస్టు 12 ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి వాష్‌రూమ్‌కి వెళ్లి చెరువు వద్దకు చేరుకున్నట్లు తెలిపారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందగా, పైకి తేలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
