అల్ఫోర్స్ టైనీ టాట్స్ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

కరీంనగర్, ఆగస్టు 11: వావిలాల పల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, వారికి ఆరోగ్య అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చడం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు చదువులో రాణించవచ్చని అన్నారు. ఈ మాత్రలు రోగనిరోధక శక్తిని పెంపొందించి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల శ్రేయస్సు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
