తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి ఘనంగా

పెబ్బేరు: బడుగు, బలహీన వర్గాల విముక్తి, స్వేచ్ఛ, సమానత్వం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, కుల–మత ఐక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ బందుక్ ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతిని శుక్రవారం పెబ్బేరు మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోనెల బాలస్వామి, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చింతకాయల కురుమూర్తి, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, గోనెల సహదేవుడు, జిల్లా డైరెక్టర్ సొప్పరి బీసుపల్లి, సంగనమోని శ్రీనివాసులు, గొడుగు శాంతయ్య, చింతకాయల భీముడు, వెంకటేష్, ఆనంద్, గోనెల కురుమూర్తి, సురేష్ బాలరాజు, దేవి ప్రసాద్, కె. రాముడు, రఘు, భాను, సాయి, గణేష్ మరియు మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
