హుజురాబాద్ పట్టణంలో గ్రాండ్ జాబ్ మేళా – 2025

హుజురాబాద్, జూలై 13: హుజురాబాద్ నియోజకవర్గ యువతకు అనుకున్న అవకాశాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రోత్సాహంతో జూలై 21న గ్రాండ్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా పేరొందిన 70కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3000కుపైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండబోతున్నాయి. ఫ్రెషర్స్తో పాటు అనుభవజ్ఞులకూ ఈ మేళాలో అవకాశాలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
హుజురాబాద్ యువతకు సుస్థిర భవిష్యత్తు లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
