తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం – మల్లన్న టీం వైస్ ఇన్చార్జ్ దాట్ల శ్రీనివాస్

వీణవంక, జూలై 13 (జిందగీ 9 న్యూస్):
బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని మల్లన్న టీం తీవ్రంగా ఖండించింది. హుజురాబాద్ నియోజకవర్గ మల్లన్న టీం వైస్ ఇన్చార్జ్ దాట్ల శ్రీనివాస్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “మెడిపల్లిలోని తీన్మార్ మల్లన్నకు చెందిన Q న్యూస్ ఛానల్ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
Q న్యూస్ ఆఫీస్‌లోని పర్మిషన్ను ధ్వంసం చేసి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. “బీసీల గొంతుకగా వినిపించే ఛానల్‌పై దాడి చేయడం అంటే రెండు కోట్ల బీసీలపై దాడి చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ దుశ్చర్యపై వెంటనే స్పందించి, దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
