పెబ్బేరు, జూన్ 17:
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బ్యాంకర్ల గ్రామీణ మరియు హౌ సహాయకుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) సహకారంతో, బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత జర్దోసి మగ్గం అల్లికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం పెబ్బేరు లోని లిటిల్ స్కాలర్ స్కూల్ పక్కన ఏర్పాటు చేయబడింది. వయస్సు 19 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శిక్షణలో పాల్గొనేవారికి ఉచిత భోజనం, ఉచిత శిక్షణ మెటీరియల్ అందజేయబడుతుంది.
మొత్తం 45 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుండగా, శిక్షణ పూర్తయిన అనంతరం ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జర్దోసి వర్క్ పై ఆసక్తి ఉన్న మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి. సత్తయ్యను 9949104515 నంబర్ లో సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమం జూన్ 18, 2025 (బుధవారం) నుండి ప్రారంభం కానుంది. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్నవారు తప్పకుండా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
