
వైరా, మే 17 (zindagi9news): వైరా నియోజకవర్గ కేంద్రంలో మే 24న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వగృహంలో, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైరా శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, “ప్రతీ యువకుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్రంలో యువత ఉపాధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని తెలిపారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పిసిసి కార్యదర్శి నూతి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, వైరా మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, కొనిజర్ల మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, కన్నెగంటి నాగేశ్, పణితి శ్రీను, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నల్లపు దుర్గాప్రసాద్, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
