
జమ్మికుంట, మే 17 (Zindagi9News): జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో ఓ ఇంటిలో చోరీ కలకలం రేపింది. మారపల్లి మొగిలి (60) తన భార్య లక్ష్మితో కలిసి మే 16న ఉదయం 8 గంటల ప్రాంతంలో తమ ఆవులను తీసుకుని పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి, అందులోని బట్టలు, పత్రాలు చిందరవందరగా విసిరి వేసినట్లు తెలిపారు. బీరువాలో ఉంచిన రూ.20,000 నగదు మరియు పావుల ఎత్తు బంగారం కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
మొగిలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరిని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
