
హుజూరాబాద్ నియోజకవర్గానికి మంజూరైన దళిత బంధు పథకంలో మిగిలిపోయిన 5,000 లబ్ధిదారులకు వెంటనే రెండో విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ కలెక్టర్ డా. పమేలా సత్పతి ను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు 13,000 లబ్ధిదారులకు నిధులు అందగా, మిగిలిన వారి ఖాతాల్లో నిధులు జమైనా ఫ్రీజ్ చేయడం వల్ల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
నిధులపై ఉన్న ఫ్రీజ్ను తక్షణమే ఎత్తివేసి, మిగిలిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, పావని వెంకటేశ్, దిలీప్, నాగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
