వేసవిలో దాహార్తి నివారణకు సమాజ సేవకు ముందుకొచ్చిన కమిటీలు
పెబ్బేరు, మే 6 (zindagi9news):వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలకు చల్లటి నీరు అందించేందుకు పెబ్బేరు పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి సూచన మేరకు పెబ్బేరు సంత పరిరక్షణ సమితి మరియు వేణుగోపాల స్వామి భూమి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
పట్టణానికి వివిధ గ్రామాల నుండి వాణిజ్య, వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సేవలందించేందుకు బస్టాండు, సుభాష్ చౌరస్తా, కొల్లాపూర్ ఖమాన్ చౌరస్తా వంటి మూడు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సంత కాంట్రాక్టర్లు, సంత సభ్యులు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు.
పబ్లిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేసవిలో దాహాన్ని తీర్చేందుకు ఈ చర్యలు మానవతావాద ధోరణికి నిదర్శనమని స్థానికులు అభినందిస్తున్నారు.
