జమ్మికుంట, మే 2 (zindagi9news): తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో 100% వసూలు మరియు 5% రిబేట్ అమలులో జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానం సాధించింది. ఈ గౌరవానికి గుర్తింపుగా, మున్సిపల్ సెక్రటరీ టి.కే. శ్రీదేవి IAS ఆధ్వర్యంలో శుక్రవారం రూ.3 కోట్ల అభివృద్ధి నిధుల ప్రొసీడింగ్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, “ఆస్తి పన్ను వసూళ్లలో శాతం తేగలగడం మున్సిపాలిటీ యొక్క శ్రమకు ఫలితం. అభివృద్ధి పనులకు మూడు కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరం” అని పేర్కొన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి నెలకు ముందే వసూళ్లు పూర్తి చేయాలని కమిషనర్ అయాజ్తో పాటు సిబ్బందికి సూచించారు.
కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ, “మంజూరైన నిధులను పట్టణ అభివృద్ధిలో భాగంగా జంక్షన్ల అభివృద్ధికి, ఆదాయం వచ్చే ప్రాజెక్టులకు వినియోగిస్తాం” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, ఆర్ఓ వాణి, మహేష్, బిల్ కలెక్టర్ మొగిలయ్య, పాషా, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
